
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చనిపోయారని సోషల్ మీడియాలో తప్పడు ప్రచారం చేస్తున్నారని.. అది అబద్ధమని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ అన్నారు. తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోలేదని.. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారని అభిజిత్ తెలిపారు. సోషల్ మీడియాలో ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయోద్దని ఆయన కోరారు.
అదేవిధంగా ప్రణబ్ కూతురు షర్మిష్టా ముఖర్జీ కూడా ఈ తప్పుడు ప్రచారంపై స్పందించారు. తన తండ్రి ప్రణబ్ చనిపోలేదని.. ఆయన బతికే ఉన్నారని ఆమె తెలిపింది.
ప్రణబ్ చికిత్స పొందుతున్న ఆర్ అండ్ ఆర్ హాస్పిటల్ కూడా ప్రణబ్ ముఖర్జీ చనిపోయారని వస్తున్నవార్తలను ఖండిస్తూ.. అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు ఉదయం వరకు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపింది. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్టుతోనే ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
For More News..