మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత

మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత

ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా కన్నుమూశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన శనివారం(అక్టోబర్ 12) తుది శ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన సాయిబాబా ఈమధ్యనే జైలు నుంచి విడుదల అయ్యారు. నక్సలైట్లతో చేతులు కలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని 2014లో మహారాష్ట్ర పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆయనతో పాటు మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి వీల్ ఛైర్‌కి పరిమితమైన ఆయన.. పదేళ్ల పాటు జైలు గదికి పరిమితమయ్యారు. ఈ ఏడాది మార్చిలో బాంబే హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. చివరగా 2024 మార్చి7న నిర్దోషిగా నాగ్‌పూర్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.