
ఆంధ్రప్రదేశ్ లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మాజీ రంజీ ప్లేయర్ ను అరెస్ట్ చేశారు నెల్లూరు జిల్లా పోలీసులు. 2014 నుంచి 2016 వరకు AP క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన నాగరాజు… ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కాడు. క్రికెట్ మ్యాచ్ లను నిర్వహిస్తామంటూ స్పాన్సర్ల దగ్గర డబ్బు తీసుకొని మోసం చేశాడు.
ఈ ఆరోపణలతో గతంలోనే రంజీ మ్యాచ్ ల నుంచి అతన్ని పక్కకు పెట్టారు. అయిన బుద్ది మారని నాగరాజు… రంజీ మ్యాచ్ లో బ్యాట్లపై లోగా వేయిస్తానని చెప్పి ఓ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని సంపద్రించాడు. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత కార్యదర్శినంటూ…. గొంతు మార్చి హాస్పిటల్ కు ఫొన్ చేశాడు.
మూడున్నర లక్షలు ఇవ్వాలని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన హాస్పిటల్ యాజమాన్యం… పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ అతనిపై హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖలోనూ కేసులు నమోదైనట్లు, జైలుకు కూడా వెళ్లివచ్చినట్లు పోలీసులు తెలిపారు.