ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత్ దాస్

ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత్ దాస్

ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ( ఫిబ్రవరి 22) శక్తికాంత దాస్ నియమకాన్ని కేబినెట్ అపాయింటెమెంట్స్ కమిటీ ఆమోదించింది. ప్రధాని మోదీ పదవీలో ఉన్నంత వరకు  లేదా తదుపరి ఉత్వర్వులు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

శక్తికాంత దాస్ ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా ఉంటారు. ఇప్పటికే పికె మిశ్రా ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన సెప్టెంబర్ 11, 2019 నుండి ఈ పదవిలో ఉన్నారు.