పెర్‌‌‌‌ క్యాపిటా ఇన్‌‌కమ్‌‌ వేగంగా పెరగాలి : సీ రంగరాజన్‌‌    

  • పెర్‌‌‌‌ క్యాపిటా ఇన్‌‌కమ్‌‌ వేగంగా పెరగాలి
  • ఆర్‌‌‌‌బీఐ మాజీ గవర్నర్‌‌‌‌ సీ రంగరాజన్‌‌    

హైదరాబాద్‌‌, వెలుగు :  ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదగడం ప్రశంసించదగ్గ విషయమని, కానీ పెర్ క్యాపిటా ఇన్‌కమ్‌ పెరగాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సీ రంగరాజన్ అన్నారు. ఐసీఎఫ్‌ఏఐ ఫౌండేషన్‌ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్‌ 13 వ కాన్వొకేషన్‌లో ఆయన మాట్లాడారు. కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత  ఇండియా ఫ్యూచర్ డెవలప్‌మెంట్‌పై  రోడ్‌ మ్యాప్ ఉండాలని అన్నారు.

ALSO READ: తెలంగాణలో బీజేపీ లేదు.. కేసీఆర్ పతనం మొదలైంది : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 

ముఖ్యంగా గ్రోత్ రేటు పెంచడంపై ఫోకస్ పెట్టాలని పేర్కొన్నారు. ‘ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ప్రశంసించదగ్గది. పెర్ క్యాపిటా గురించి మాట్లాడితే మాత్రం అది డిఫరెంట్ స్టోరీ.  పెర్‌‌ క్యాపిటా ఇన్‌కమ్‌ పరంగా 2020 లో  ఇండియా స్థానం 197 దేశాల్లో 142. మనం వేగంగా వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది’ అని రంగరాజన్ వివరించారు. వచ్చే 20 ఏళ్లలో ఏడాదికి 7 శాతం గ్రోత్ సాధిస్తే దేశం చాలా మారుతుందని చెప్పారు.  ఇండియా డెవలప్ అయిన దేశంగా కూడా మారొచ్చని వెల్లడించారు.