నెక్కొండ, వెలుగు: వరంగల్జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ గీతాభాస్కర్, సొసైటీ చైర్మన్ దామోదర్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ర్ట అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్‌ను గెలించాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు సోంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, మండల ప్రెసిడెంట్ అశోక్, లీడర్లు హరిప్రసాద్, శివకుమార్ తదితరులున్నారు.