సూర్యాపేట జిల్లాలో దారుణం..మాజీ సర్పంచ్‌‌ హత్య

సూర్యాపేట జిల్లాలో దారుణం..మాజీ సర్పంచ్‌‌ హత్య

తుంగతుర్తి, వెలుగు : మాజీ సర్పంచ్‌‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో సోమవారం జరిగింది. నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌‌ మెన్చు చక్రయ్య (68) సోమవారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ పని ముగించుకొని తిరిగి వస్తూ గ్రామ శివారులోని ముత్యాలమ్మ గుడి వద్దకు చేరుకోగానే గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేశారు.

తీవ్రంగా గాయపడ్డ చక్రయ్య కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని చక్రయ్యను సూర్యాపేట హాస్పిటల్‌‌కు తరలించగా ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ చనిపోయాడు. చక్రయ్యపై దాడిలో 12 మంది పాల్గొన్నారని సమాచారం. అయితే కుటుంబసభ్యులే హత్య చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు, హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.