మోహన్​రావుపేట మాజీ సర్పంచ్​ మిస్సింగ్​ 

మోహన్​రావుపేట మాజీ సర్పంచ్​ మిస్సింగ్​ 
  • కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గల్లంతయినట్లు అనుమానాలు   

కోరుట్ల, వెలుగు: కోరుట్ల మండలం మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పూదరి దేవక్క(73) కనిపించడం లేదని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్​ శుక్రవారం తెలిపారు. కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయిన ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమె కోసం కుటుంబసభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు.

మధ్యాహ్నం మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామ సమీపంలోని ఎస్పారెస్సీ కెనాల్ మెట్లపైన చెప్పులు, సంచి ఉండడాన్ని అక్కడి వారు గమనించారు. సంచిలో సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫోన్​ నెంబర్లు ఉన్న పేపర్​లభించాయి. దీంతో కుటుంబసభ్యులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దేవక్క కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గల్లంతు అయినట్లు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. దేవక్క భర్త నర్సయ్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్​ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పూదరి నర్సయ్య,- దేవక్క దంపతులిద్దరూ గతంలో మోహన్​రావుపేట గ్రామ సర్పంచులుగా దాదాపు 20 ఏళ్లు పనిచేశారు.