పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచుల అర్ధనగ్న ప్రదర్శన

పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచుల అర్ధనగ్న ప్రదర్శన

పంజాగుట్ట, వెలుగు: పెండింగ్ ​బిల్లులు రిలీజ్​చేయాలని కోరుతూ మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం బేగంపేటలోని ప్రజాభవన్​లో నోడల్ ఆఫీసర్ కు వినతి పత్రం అందజేశారు. బయటికి వచ్చాక వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్​ఆధ్వర్యంలో ప్రజాభవన్​వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పంజాగుట్ట పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్​స్టేషన్​కు తరలించారు. అరెస్ట్​అయిన వారిలో జేఏసీ ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్​రెడ్డి, కేశబోయిన మల్లయ్య, బొడ్డు నర్సింహులు, రవీందర్, దుర్గం నరేశ్​యాదవ్ పాల్గొన్నారు.