మునుగోడు మండలంలో పలువురు బీజేపీలో చేరారు. ఇప్పర్తి, తెరట్ పల్లి, రావిగూడెం, జక్కలవారి గూడెం గ్రామాల్లోని వివిధ పార్టీలకు చెందిన మాజీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు, గ్రామ శాఖల అధ్యక్షు లతో పాటు 100 మంది బీజేపీలోకి జాయిన్ అయ్యారు. కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి వారందరికీ కాషాయ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
మునుగోడు ఉప ఎన్నికలో విజయం కోసం బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతోంది. గెలుపు కోసం పావులు కదుపుతున్న పార్టీ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. నాయకులతో పాటు కార్యకర్తలను తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కమలం పార్టీలో జాయిన్ అవుతున్నారు.