యూఎన్ఓ అంతర్గత న్యాయమండలి చైర్​పర్సన్గా జస్టిస్​ మదన్​ బి.లోకుర్

యూఎన్ఓ అంతర్గత న్యాయమండలి చైర్​పర్సన్గా జస్టిస్​ మదన్​ బి.లోకుర్

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ మదన్​ బి.లోకుర్​ యునైటెడ్​ నేషన్స్​ ఆర్గనైజేషన్​ అంతర్గత న్యాయ మండలి చైర్​పర్సన్​గా నియమితులయ్యారు. ఈ పదవిలో 2028, నవంబర్​ 1 వరకు కొనసాగనున్నారు. పలువురు ఇతర న్యాయకోవిదులు సభ్యులుగా ఉన్న ఈ మండలికి జస్టిస్​ మదన్​ బి.లోకుర్​ నేతృత్వం వహిస్తారు.
ఉరుగ్వేకు చెందిన కార్మెన్​ ఆర్టిగాస్​, ఆస్ట్రేలియాకు చెందిన రోసాలీ బాల్కిన్​, ఆస్ట్రియాకు చెందిన స్టెఫాన్​ బ్రెజీనా, అమెరికాకు చెందిన జే పొజెన్​ల్ ఈ మండలిలో సిబ్బంది, యాజమాన్య ప్రతినిధులుగా నియమితులయ్యారు. 
జస్టిస్​ మదన్ బి.లోకుర్​ 2012, జూన్​ 4న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2018, డిసెంబర్ 30న పదవీ విమరణ చేశారు. 2019లో మదన్​ బి.లోకుర్​ ఫిజీ సుప్రీంకోర్టులో నాన్ రెసిడెంట్​ప్యానెల్​ జడ్జిగా నియమితులయ్యారు. మరో దేశానికి చెందిన సుప్రీంకోర్టుకు జడ్జిగా నియమితులైన తొలి భారతీయ న్యాయమూర్తిగా ఆయన నిలిచారు. 

యూఎన్​ఓ అంతర్గత న్యాయ మండలి

 యూఎన్​ఓ అంతర్గత న్యాయ వ్యవస్థ నిర్వహణలో కొంత స్వతంత్రత, పారదర్శకత అవసరం కావడంతో 2009లో అంతర్గత న్యాయ మండలిని యూఎన్​ జనరల్​ అసెంబ్లీ అధికారికంగా స్థాపించింది.ఈ న్యాయ మండలిలో రెండు ప్రధాన అంగాలు ఉన్నాయి. 

ALSO READ | భారత జలాలలోకి వస్తే అంతు చూడటమే.. నేవీలోకి రెండు యుద్ధనౌకలు

యునైటెడ్​ నేషన్స్​ డిస్ప్యూట్​ ట్రిబ్యునల్​(యూఎన్​డీటీ): ఉద్యోగులు, ఐక్యరాజ్యసమితి మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది. 

యునైటెడ్​ నేషన్స్​ అప్పీల్​ ట్రిబ్యునల్​(యూఎన్​ఈటీ): యూఎన్​డీటీ ఇచ్చిన తీర్పులపై అనుమానాలను, అప్పీలును సమీక్షిస్తుంది.