వెల్లింగ్టన్: హ్యారీ బ్రూక్ (91 బాల్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో123) మెరుపు సెంచరీతో సత్తా చాటడంతో న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి రోజు పైచేయి సాధించింది. శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లిష్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 280 స్కోరుకు ఆలౌటైంది. బెన్ డకెట్ (0), జాక్ క్రాలీ (17), బెతెల్ (16), జో రూట్ (3) నిరాశపరచగా.. ఒలీ పోప్ (66)తో ఐదో వికెట్‌కు 174 రన్స్ జోడించిన బ్రూక్ జట్టును ఆదుకున్నాడు.
కివీస్ బౌలర్లలో నేథన్ స్మిత్ నాలుగు, ఒరూర్క్ మూడు వికెట్లతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్ తొలి రోజు చివరకు మొదటి ఇన్నింగ్స్‌లో 86/5తో కష్టాల్లో పడింది. కేన్ విలియమ్సన్ (37) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. బ్రైడన్ కార్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఒరూర్క్ (0 బ్యాటింగ్), బ్లండెల్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉండగా.. ఇంగ్లండ్ స్కోరుకు కివీస్ ఇంకా 194 రన్స్ దూరంలో ఉంది.