
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజినీ దేవి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కరీంనగర్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో తన తల్లి మృతి పట్ల రాధాకృష్ణన్ రావు నాంపల్లి కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు వేశారు. ఈ పిటిషన్ పై మరికాసేపట్లో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నారు రాధాకిషన్ రావు.