మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. టీడీపీ తరపున మహబూబ్ నగర్ లోని అమరచింత( ప్రస్తుత దేవరకద్ర) నుంచి రెండు సార్లు, మక్తల్ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కొత్తకోట దయాకర్ రెడ్డి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు.
కొత్తకోట దయాకర్ రెడ్డిది మహబూబ్ నగర్ జిల్లా నర్వ మండలం పర్కాపూర్ గ్రామం. టీడీపీ నుంచి 1989 లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2009లో కొత్తకోట దయాకర్ రెడ్డి మక్తల్, ఆయన భార్య సీతా దయాకర్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దంపతులిద్దరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి రికార్డ్ సృష్టించారు.