నవంబర్3న బీఆర్ఎస్​లోకి కాసాని

  • ఎర్రవల్లి ఫాంహౌస్​లో కేసీఆర్ సమక్షంలో చేరిక

హైదరాబాద్, వెలుగు: టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఎర్రవల్లిలోని ఫామ్​హౌస్​లో బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండటంతో ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. మూడు రోజుల కింద కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరాల్సి ఉండగా, వివిధ కారణాలతో వాయిదా పడింది. ఫాం హౌస్​లో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అనుచరులతో ఆయన బీఆర్ఎస్​లో చేరనున్నారు.

బీఆర్ఎస్​లోకి చేవెళ్ల కాంగ్రెస్ లీడర్

చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేశమల్ల ఆంజనేయులు గురువారం బీఆర్ఎస్​లో చేరారు. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్​లో కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్​రెడ్డి, బీఆర్ఎస్ లీడర్లు పెంటారెడ్డి, క్యామ మల్లేశ్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :బొగ్గు గనిలో ప్రమాదం.. కార్మికుడు మృతి