రోహిత్‌‌‌‌ కష్టమే: రవిశాస్త్రి

రోహిత్‌‌‌‌ కష్టమే: రవిశాస్త్రి

మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌ : బోర్డర్‌‌‌‌–గావస్కర్‌‌‌‌ ట్రోఫీలో వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ.. తన భవిష్యత్‌‌‌‌ను ఓసారి అంచనా వేసుకోవాలని టీమిండియా మాజీ కోచ్‌‌‌‌ రవి శాస్త్రి అన్నాడు. సాంప్రదాయ ఫార్మాట్‌‌‌‌లో హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌కు టెక్నిక్‌‌‌‌ చాలా ఇబ్బందిగా మారిందన్నాడు. విరాట్‌‌‌‌ కోహ్లీకి మాత్రం మరో మూడు నాలుగేళ్లు టెస్ట్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఆడే సత్తా ఉందని శాస్త్రి వెల్లడించాడు. ‘విరాట్‌‌‌‌ ఔటవుతున్న విధానాన్ని మర్చిపోండి.

కొన్నిసార్లు స్టాన్స్‌‌‌‌ను మార్చుకుంటే కచ్చితంగా గాడిలో పడతాడు. కానీ రోహిత్‌‌‌‌  ఫామ్‌‌‌‌ ఆందోళనకు గురి చేస్తోంది. టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో ఆడాలంటే కచ్చితమైన ఫుట్‌‌‌‌వర్క్‌‌‌‌ ఉండాలి. ప్రతి మ్యాచ్‌‌‌‌కు అతని ఫుట్‌‌‌‌వర్క్‌‌‌‌లో తేడా కనిపిస్తోంది. ముఖ్యంగా అతని ఫ్రంట్‌‌‌‌ ఫుట్‌‌‌‌ కదలికల్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.

ఫ్రంట్‌‌‌‌ ఫుట్‌‌‌‌ బాల్‌‌‌‌ వైపు కదలదు. అక్కడ ఓ ట్రిగ్గర్‌‌‌‌ కదలిక ఉండాలి. కానీ అది రోహిత్‌‌‌‌లో లోపించింది’ అని శాస్త్రి పేర్కొన్నాడు. మరోవైపు రోహిత్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ కాకపోతే ఇన్నాళ్లూ ఆడే అవకాశమే లేదని మాజీ బౌలర్‌‌‌‌ ఇర్ఫాన్‌‌‌‌ పఠాన్‌‌‌‌ విమర్శించాడు.