
- మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
సిద్దిపేట, వెలుగు : తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎర్రవల్లి నుంచి చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. గురువారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రజల్ని కలిసే అవకాశం లేకపోగా ప్రతి పక్షాలను సైతం మాట్లాడనివ్వకుండా చేస్తున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కారుపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయన్నారు.
మోదీ కేవలం రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప సమాజ శ్రేయస్సును ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ విలీన దినోత్సవం రోజే కాంగ్రెస్ మొట్టమొదటిసారి సీడబ్ల్యూసీ మీటింగ్ ను ఇక్కడే నిర్వహిస్తోందని, సభలో సోనియా గాంధీ దేశానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మార్క సతీశ్, గంప మహేందర్ రావు, గూడురి శ్రీనివాస్ పాల్గొన్నారు.