బీఆర్ఎస్​నేతలు అధికారమదంతో విర్రవీగుతున్నరు: రేణుకా చౌదరి

ఖమ్మం: బీఆర్ఎస్​నేతలు అధికారమదంతో విర్రవీగుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత రేణుకా చౌదరి ఫైర్​అయ్యారు. ఖమ్మంలో ఏర్పాటుచేసిన ప్రెస్​మీట్ లో ఆమె మాట్లాడారు. ‘టీఎస్పీఎస్సీలో పేపర్లు లీకై యువత ఉద్యోగాలు సాధించలేకపోతుంది. ఐటీలో కేటీఆర్​కింగ్​అంటరు. కానీ కొలువులు మాత్రం ఇవ్వరు. రైతులకు బేడీలు వేసిన చరిత్రను మరువద్దు. 

ఎంఐఎం చెబితే ఓటు వేసే రోజులు పోయాయి. తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీని పక్కన పెట్టిన బీఆర్ఎస్ అనే కొత్త సినిమా తెరను చించే సమయం వచ్చింది. ఎవరెన్నీ ఇబ్బందులు పెట్టిన ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలు మావే. కాంగ్రెస్​అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తం’ అని రేణుక చౌదరి స్పష్టంచేశారు.