వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : రామప్ప ఆలయాన్ని ఆదివారం కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గైడ్ ద్వారా రామప్ప విశిష్టతను తెలుసుకున్నారు.
కాకతీయ కట్టడాలు, రామప్ప శిల్పకళా సౌందర్యం అద్భుతంగా ఉందన్నారు. మరో వైపు వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రామప్ప ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.