కరీంనగర్ జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి వర్ధంతి

కరీంనగర్ జిల్లాలో  కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి వర్ధంతి
  • ఉమ్మడి జిల్లాలో  కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి వర్ధంతి 

నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు: పేదల పెన్నిధి కాకా వెంకటస్వామి అని వక్తలు కొనియాడారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ పట్టణాల్లోని ఆయన వర్ధంతిని కాంగ్రెస్‌‌‌‌ శ్రేణులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కార్మికుల కోసం పోరాడిన మహానేత అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో డీసీసీ ఆఫీసులో సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి హాజరై కాకా ఫొటోకు నివాళులర్పించారు.

కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ మాల మహానాడు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కాడె శంకర్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. గోదావరిఖనిలో మేయర్‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, లయన్స్‌‌‌‌ క్లబ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ పి.మల్లికార్జున్‌‌‌‌, దళిత సంఘాల ఆధ్వర్యంలో కాకా విగ్రహానికి నివాళులర్పించారు. సింగరేణి ఆర్జీ 2 జీఎం ఆఫీస్​లో, మాలమహానాడు ఆధ్వర్యంలో, మెట్‌‌‌‌పల్లిలో జువ్వాడి నర్సింగారావు ఆధ్వర్యంలో  నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి,  జగిత్యాల, సిరిసిల్ల, జమ్మికుంట, హుజూరాబాద్‌‌‌‌ పట్టణాల్లో కాకా వర్ధంతి నిర్వహించారు.