చెవికి బ్యాండేజ్ తో ట్రంప్.. కాల్పుల తర్వాత తొలి సారి ఇలా..

చెవికి బ్యాండేజ్ తో ట్రంప్..  కాల్పుల తర్వాత తొలి సారి ఇలా..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల తర్వాత తొలి సారి బహిరంగంగా కనిపించారు.  కాల్పుల జరిగిన రెండు రోజుల తర్వాత  జూలై 15న జరిగిన మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌ కు  ట్రంప్ హాజరయ్యారు. తన చెవికి తెల్లటి  బ్యాండేజ్  ధరించి ఎంట్రీ ఇచ్చారు.   సదస్సులో స్క్రీన్ పై ట్రంప్ కనిపించగానే  ది యూఎస్ ఏ అనే నినాదాలతో మార్మోగిపోయింది.   చప్పట్లతో ట్రంప్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 

 జూలై 14న పెన్సిల్వేనియాలో పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతుండగా ట్రంప్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయాలయ్యాయి. ఆ తర్వాత  కాల్పులు జరిపిన క్రూక్ ను భద్రతా సిబ్బంది కాల్చి చంపారు.

Also Read:-జర్రయితే పాణం పోతుండే..అదృష్టం కొద్దీ బయటపడ్డ

 కాల్పుల తర్వాత మొదటి సారి మీడియాతో మాట్లాడిన ట్రంప్..  దుండగుడి కాల్పుల్లో తాను ఇక చనిపోయాననే అనుకున్నట్టు  చెప్పారు. అదృష్టమో.. దేవుడి దయో తెలీదు కానీ.. ప్రాణాలతో బయటపడ్డా అని తెలిపారు. అదొక భయంకరమైన అనుభవమని చెప్పారు. హత్యాయత్నం తర్వాత ట్రంప్ తొలిసారి న్యూయార్క్ పోస్టు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మిల్వాకీలో నిర్వహించిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్​లో పాల్గొనేందుకు వెళ్తూ ఆయన మాట్లాడారు. ‘‘నాపై దేవుడి దయ లేకపోయి ఉంటే.. నేను ఈ టైమ్​లో ఇక్కడ ఉండేవాడిని కాదు. దుండగుడు జరిపిన కాల్పుల్లోనే చనిపోయే వాడిని. ఆ టైమ్​లో నేను చనిపోయాననే అనుకున్న.. కానీ, చివరికి ప్రాణాలతో బయటపడ్డా. నా పైన హత్యాయత్నం జరిగిందంటే నేనే నమ్మలేకపోతున్న. ఆ సమయంలో షాక్​కు గురయ్య. మళ్లీ కొన్ని క్షణాల్లోనే తేరుకున్న. స్పీచ్ ఇస్తున్నప్పుడు కరెక్ట్ టైమ్​లో నా తల కొద్దిగా తిప్పాను. అప్పుడే బుల్లెట్ నా చెవిని తాకుతూ వెళ్లిపోయింది. తల తిప్పకపోతే నా ప్రాణాలు పోయేవి. క్షణం లేట్ అయినా.. బుల్లెట్ నేరుగా తలలో దూసుకుపోయేది’’ అని ట్రంప్ అన్నారు.

మరో వైపు అమెరికా ఉపాధ్యక్ష   అభ్యర్థిగా  ఒహ యో సెనేటర్‌ జేమ్స్ డేవిడ్ వాన్స్‌ను (JD Vance)  ట్రంప్  ప్రకటించిన సంగతి తెలిసిందే. జేడీ వాన్సన్ తెలుగు సంతతి వ్యక్తికి చెందిన ఉషా చిలుకూరి వాన్స్ భర్త కావడం విశేషం.