ఖైరతాబాద్ బడా గణేష్ని సన్నిధిలో..మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఖైరతాబాద్ బడా గణేష్ని సన్నిధిలో..మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

హైదరాబాద్ ఫేమస్ గణేష్..ఖైరతాబాద్ మహాగణనాధునికి ఆరో రోజుపూజలు కొనసాగుతున్నాయి. 2024 సెప్టెంబర్ 11న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖైర తాబాద్ బడా గణేష్ ని దర్శించుకున్నారు. వెంకయ్యనాయుడికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు పూజారులు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.   

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు వెంకయ్య నాయుడు.  ఎలాంటి విఘ్నాలు లేకుండా అందరికి మంచి జరగాలని.. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడాలని మహాగణపతిని కోరుకున్నారు మాజీ ఉపరాష్త్రపతి వెంకయ్యనాయుడు. ధర్మం విరజిల్లాలని అందరూ ధర్మ బద్దం నడుచుకోవాలని సూచించారు. 

మరోవైపు ఆరోరోజు కూడా ఖైరతాబాద్ బడా గణేషుని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలు, తెలంగాణతోపాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. దీంతో ఉదయం గణపతి హోమం, ప్రత్యేక హారతి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు ఉత్సవ కమిటి నిర్వాహకులు. 

గురువారం సాయంత్రం ఖైరతాబాద్ గణేష్ పండళ్ సమీపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.