వినేష్ ఫోగట్.. రైల్వే ఉద్యోగానికి రాజీనామా

వినేష్ ఫోగట్.. రైల్వే ఉద్యోగానికి రాజీనామా

మాజీ ఇండియన్ రెజ్లర్ వినేష్ ఫోగట్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.ఇండియన్ రైల్వే లో పనిచేస్తున్న ఆమె..శుక్రవారం (సెప్టెంబర్ 6న) తన ఉద్యోగానికి రాజీ నామా చేసింది. ఇండియన్ రైల్వే లో పనిచేయడం చాలా గర్వంగా ఉంది. నా జీవితంలఅో అదో తీపి జ్ణాపకం.. అని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం Xలో తన రాజీనామా లెటర్ ను షేర్ చేసింది.   

ప్రస్తుత పరిస్థితుల్లో రైల్వే ఉద్యోగానికి తనంతతానుగా రాజీనామా చేస్తున్నట్లు వినేష్ ఫోగల్ తెలిపింది. భారత జాతికి సేవలందించే ఈ అవకాశం నాకు అందించిన ఇండియన్ రైల్వే కుటుంబానికి కృతజ్ణతలు అని చెప్పింది. 

30యేళ్ల రెజ్లర్ వినేష్ ఫోగట్.. ఇటీవల పారీస్ ఒలింపిక్స్ లో 50 కేజీల గోల్డ్ మెడల్ మ్యాచ్ లో అనర్హత వేటు తర్వాత రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిం చింది..అయితే  కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ తిరస్కరించిన నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమె అప్పీల్ చేసింది. 

ఈ నాటకీయ పరిణామాల తర్వాత ఆమె..నిన్న బజరంగ్ పునియాతో కలిసి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఆమె హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ అధి ష్టానం ఆఫర్ ఇచ్చింది. ఈ క్రమంలో వినేష్ ఫోగట్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు.