బీజేపీకి జోష్.. పార్టీలో చేరిన  WWE  ద గ్రేట్ ఖలీ

న్యూఢిల్లీ: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్, ప్రొఫెష‌న‌ల్ రెజ్ల‌ర్ ద‌లిప్ సింగ్ రాణా అలియాస్ ద గ్రేట్ ఖ‌లీ బీజేపీలో చేరారు. గురువారం బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. పంజాబ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేర‌డం ప్ర‌త్యేక‌త సంత‌రించుకున్న‌ది. ఈనెల 20వ తేదీన పంజాబ్ లో  అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్.. మార్చి 11న ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. 
ఈ సందర్భంగా  రెజ్ల‌ర్ ద గ్రేట్ ఖ‌లీ మాట్లాడుతూ బీజేపీలో చేర‌డం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దేశం కోసం మోదీ చేస్తున్న ప‌నులు ఆయ‌న్ను ఉత్త‌మ ప్ర‌ధానిగా మార్చింద‌న్నారు. దేశ సమగ్రతాభివృద్ధిలో భాగ‌స్వామ్యం కావ‌డం కోసమే తాను బీజేపీలో చేరుతున్నట్లు ఖ‌లి తెలిపారు. బీజేపీ జాతీయ విధానం త‌నను ఆక‌ర్షించిందన్న‌ారు. ఖలీ 2000 సంవత్సరంలో ప్రొఫెషనల్ రెజ్లింగ్ లోకి అడుగుపెట్టడానికి ముందు పంజాబ్ లో పోలీసు అధికారిగా పనిచేశారు. డబ్ల్యూడబ్ల్యూఈ రంగంలోకి వచ్చాక 2007లో ఏకంగా WWE ఛాంపియన్ షిప్ సాధించి సత్తా చాటుకున్నారు. అలాగే హాలీవుడ్, ఇటు బాలీవుడ్ సినిమాల్లో, బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా కనిపించారు.

 

ఇవి కూడా చదవండి

లతా మంగేష్కర్ కు ఐక్య రాజ్య సమితి నివాళి
తక్కువ రేట్లకు వినోదాన్ని అందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశం

ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల