ట్రీట్‌మెంట్ గట్టిగానే..!: పోలీసు కస్టడీకి వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్

ట్రీట్‌మెంట్ గట్టిగానే..!: పోలీసు కస్టడీకి వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజులు అతన్ని విచారించేందుకు అనుమతినిచ్చింది. ప్రస్తుతం నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

ఈ నెల 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి 17న మధ్యాహ్నం 1గంట వరకు నందిగం సురేష్‌ను పోలీసులు విచారించనున్నారు. అంతకుముందు పోలీసులు తొలుత 10 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్‌ వేయగా.. మంగళవారం(సెప్టెంబర్ 10) దానిని 8 రోజులు చాలన్నట్లు మరో పిటిషన్‌ వేశారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు రెండు రోజులు మాత్రమే అనుమతినిచ్చింది.

ట్రీట్‌మెంట్ తప్పదా..!

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు ఆ పార్టీ నేతలు అరెస్టైన విషయం తెలిసిందే. వైసీపీ నుండి గెలిచి ఆ పార్టీకే రెబెల్ అభ్యర్థిగా మారిన రఘురామ కృషం రాజు సైతం అరెస్ట్ అయ్యారు. వీరిలో కొందరికి పోలీసుల విచారణలో తాట తీశారని కథనాలు వచ్చాయి. ఇప్పుడు వైసీపీ మాజీకి ఎంపీకి కూడా అలాంటి ట్రీట్‌మెంట్ ఉంటుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.