కారును ఢీకొన్న బస్సు.. వేం నరేందర్ రెడ్డి సోదరుడు దుర్మరణం

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగాదేవి పల్లిలో జరిగిన  రోడ్డు ప్రమాదంలో మాజీ జెడ్పీటీసీ వేం పురుషోత్తం రెడ్డి మృతిచెందారు. పురుషోత్తం రెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి సోదరుడు. పురుషోత్తం రెడ్డి గతంలో కేసముద్రం జెడ్పీటీసీగా పని చేశారు.

పురుషోత్తం రెడ్డి  ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీ కొట్టడంతో స్పాట్ లోనే ఆయన మృతి చెందారు. పోస్టుమార్టం కోసం పురుషోత్తం రెడ్డి డెడ్ బాడీని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.