పంటలెండుతున్నాయి.. నీళ్లివ్వండి

వెలుగు, నెట్​వర్క్​ :  దమ్మపేట మండలం గండుగులపల్లి, అశ్వారావుపేట మండలంలోని గంగారం, సత్తుపల్లి మండలం పాకల గూడెంలోనూ, మంత్రి క్యాంపు ఆఫీసులోనూ గురువారం పలువురు నాయకులు, ఇతర రాష్ట్రాల రైతులు, బాధితులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు.

తమిళనాడు నుంచి రైతు పొన్ను స్వామి ఉద్యాన శాఖల అధికారులతో కలిసి పంటలు, తోటల సాగుపై చర్చించారు.  తమిళనాడు రాష్ట్రానికి వచ్చి సేంద్రియ ఎరువుల తయారీ విధానం, పంటల దిగుబడిని పరిశీలించాలని మంత్రిని కోరారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో సాగుచేసిన  వరి మొక్కజొన్న మిర్చి పంటలు ఎండిపోతున్నాయని, నీళ్లు, త్రీ ఫేస్ కరెంటు ఇవ్వాలని సీపీఐ (ఎంఎల్) ప్రజా పంథా ఆధ్వర్యంలో  రైతులు మంత్రి తుమ్మలను కలిసి వినతి ప్రతం అందజేశారు.

తిరుమలాయ పాలెం మండలం దమ్మాయి గూడెం కు చెందిన డేరంగుల పద్మ కిడ్నీ, లివర్ వ్యాధితో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా, సీఎం సహాయ నిధి నుంచి రూ.1.50 లక్షల చెక్కు ను మంత్ర ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు.