ఫార్ములా- ఈ రేస్‌ కేసులో ఈడీ విచారణ వేగవంతం.. జనవరి 2న హాజరుకానున్న HMDA మాజీ చీఫ్‌

ఫార్ములా- ఈ రేస్‌ కేసులో ఈడీ విచారణ వేగవంతం.. జనవరి 2న హాజరుకానున్న HMDA మాజీ చీఫ్‌

ఫార్ములా- ఈ రేస్‌ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. గురువారం (2 జనవరి 2025) నుండి ఈడీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. HMDA మాజీ చీఫ్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఈడీ ముందు హాజరుకానున్నారు.

అదే విధంగా శుక్రవారం అరవింద్‌కుమార్‌ విచారణకు హాజరుకానున్నారు.  ఇక జనవరి 7న మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరుకానున్నారు. HMDA నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై విచారణ జరగనుంది. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఆధారాల సేకరించిన అధికారులు గురువారం నుంచి విచారణను వేగవంతం చేయనున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లింపులపై ఏసీబీ కీలక పత్రాలను ఈడీకి అప్పగించిన విషయం తెలిసిందే. రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండానే రూ.55 కోట్లు కేటాయించడంపై ప్రభుత్వం ఏసీబీ విచరాణకు అనుమతించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌‌‌‌ అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్(ఎమ్‌‌‌‌ఏయూడీ) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఐఏఎస్ అరవింద్‌‌‌‌ కుమార్‌‌‌‌ సమక్షంలోనే నిధులు దారిమళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

  అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ టైమ్ లో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. అప్పటి మంత్రి కేటీఆర్ ను ఏ1 నిందితుడిగా పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించారని కేటీఆర్‎పై అభియోగాలు మోపింది. ఈ కేసులో ఈడీ జనవరి 2 నుంచి విచారణ వేగవంతం చేసింది. వరుసగా అధికారులను విచారించనుంది.