నేడు(జనవరి 6, 2025) ఏసీబీ.. రేపు (జనవరి 7, 2025) ఈడీ.. ఫార్ములా–ఈ రేసు కేసులో కేటీఆర్​ విచారణ

నేడు(జనవరి 6, 2025) ఏసీబీ.. రేపు (జనవరి 7, 2025) ఈడీ.. ఫార్ములా–ఈ రేసు కేసులో కేటీఆర్​ విచారణ

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ రేసు కేసులో ప్రధాన నిందితుడైన  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమవారం ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు తమ ముందు హాజరుకావాలని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ నెల 3న ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆయనను విచారించేందుకు ఏసీబీ అధికారులు ఇప్పటికే ప్రశ్నావళి సిద్ధం చేసినట్టు తెలిసింది.

ఇప్పటి వరకు సేకరించిన డాక్యుమెంట్లు, వివరాల ఆధారంగా కేటీఆర్​ను ఏసీబీ ప్రశ్నించనుంది. కాగా, ఫార్ములా–ఈ రేసులో భాగంగా బ్రిటన్​కు చెందిన ఫార్ములా–ఈ ఆపరేషన్స్ కంపెనీకి హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా రూ.54.88 కోట్లు బదిలీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోయినేడాది డిసెంబర్ 19న కేసు నమోదు చేసిన ఏసీబీ.. అందులో కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏ1గా,  ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారి అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్​ను ఏ2గా, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిని ఏ-3గా చేర్చింది.  

7న విచారణకు రావాలి..
ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో మనీలాండరింగ్ కు సంబంధించి దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో ఈ నెల 7న విచారణకు రావాలంటూ కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది.అయితే ఇదే కేసులో నిందితులైన బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. తమకు మరికొంత సమయం కావాలని కోరడంతో ఈడీ వాళ్లకు మళ్లీ నోటీసులిచ్చింది. ఈ నెల 8న బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిని, 9న అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హాజరుకావాలని ఆదేశించింది. అయితే కేటీఆర్ కూడా వాళ్లలాగే సమయం అడుగుతారా? లేక ఈడీ విచారణకు హాజరవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.