కేటీఆర్కు సుప్రీంలోనూ చుక్కెదురు : తక్షణ విచారణ కుదరదన్న కోర్టు

కేటీఆర్కు సుప్రీంలోనూ చుక్కెదురు : తక్షణ విచారణ కుదరదన్న కోర్టు
  • జనవరి 15కు వాయిదా వేసిన న్యాయస్థానం

ఢిల్లీ: ఫార్ములా ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ కు చుక్కెదురైన విషయం తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కోరుతూ కేటీఆర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో స్పెషల్ మెన్షన్ చేశారు. స్పందించిన న్యాయస్థానం తక్షణ విచారణ కుదదరని చెప్పింది.  ఈ నెల 15న విచారిస్తామని ప్రకటించింది. ఇదిలా ఉండగా కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో ఏ2గా ఉన్న హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కూడా ఈడీ విచారణకు వెళ్లారు. ఏసీబీ, ఈడీ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.