మాకు టైమ్ కావాలి..ఫార్ములా - ఈ రేసు కేసులో ఈడీని కోరిన బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్

మాకు టైమ్ కావాలి..ఫార్ములా - ఈ రేసు కేసులో ఈడీని కోరిన బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్
  • ఇద్దరికీ అవకాశం ఇచ్చిన అధికారులు 
  • ఈ నెల 8న బీఎల్ఎన్ రెడ్డి, 
  • 9న అర్వింద్ కుమార్ హాజరుకావాలని మరోసారి సమన్లు
  • 2న విచారణకు వెళ్లాల్సి ఉండగా, హాజరుకాని బీఎల్ఎన్ రెడ్డి 
  • షెడ్యూల్ ప్రకారం7న కేటీఆర్ విచారణ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఫార్ములా–ఈ రేసు కేసులో విచారణకు హాజరయ్యేందుకు తమకు మరికొంత సమయం కావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీని)ను హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అర్వింద్ కుమార్ కోరారు. ఈ కేసులో బీఎల్ఎన్ రెడ్డి గురువారమే విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ఆయన రాలేదు. తనకు మరికొంత సమయం కావాలని కోరుతూ ఈడీ అధికారులకు ఈ–-మెయిల్‌‌‌‌‌‌‌‌ పంపించారు.

ఫార్ములా–ఈ రేస్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లు, ఇతర వివరాలు అందించేందుకు 2 నుంచి 3 వారాల టైమ్ ఇవ్వాలని అందులో విజ్ఞప్తి చేశారు. మరోవైపు శుక్రవారం విచారణకు హాజరుకావాల్సిన సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారి అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా తనకు సమయం కావాలని ఈడీని కోరారు. 3 వారాల గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వీళ్లిద్దరికీ ఈడీ అవకాశం ఇచ్చింది. ఈ నెల 8న బీఎల్ఎన్ రెడ్డి, 9న అర్వింద్ కుమార్ హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు ఇద్దరికీ వేర్వేరుగా మరోసారి నోటీసులు జారీ చేసింది.

అయితే బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఈడీ అధికారులు సమయం ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఈడీని గడువు కోరుతారా? లేదంటే షెడ్యూల్ ప్రకారం 7న ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతారా? అన్నది ఉత్కంఠగా మారింది. కాగా, ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈడీ జాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్ ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలోని అధికారుల బృందం బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిని ప్రశ్నించేందుకు గురువారం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ మధ్యాహ్నం 12 గంటలైనా హైదరాబాద్ బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఈడీ కార్యాలయానికి ఆయన రాలేదు. ఈ క్రమంలోనే సమయం కోరుతూ బీఎల్ఎన్ రెడ్డి నుంచి ఈడీ అధికారులకు మెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. 

వారం క్రితమే సమన్లు..   

ఫార్ములా–ఈ రేసుకు సంబంధించి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏకు చెందిన రూ.55 కోట్లను లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించడంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను విచారించేందుకు షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖరారు చేసింది. గత శుక్రవారం ముగ్గురికీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 2న బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, 3న అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,7న కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ బోర్డుకు చెందిన నిధులను ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈవో) కంపెనీకి ఎలా తరలించారనే వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకురావాలని కోరింది.