బిగ్ బ్రేకింగ్.. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్పై కేసు.. A1 ఆయనే

బిగ్ బ్రేకింగ్.. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్పై కేసు.. A1 ఆయనే
  • A1గా కేటీఆర్, ఏ-2గా అరవింద్ కుమార్
  • ఏ-3గా హెచ్ఎండీ చీఫ్​ ఇంజినీర్ బీఎల్ ఎన్ రెడ్డి
  • ఫార్ములా ఈ పై ఏసీబీ కేసు నమోదు
  • ప్రారంభమైన కేసు దర్యాప్తు
  • నేడో, రేపో కేటీఆర్ కు నోటీసులు

హైదరాబాద్: ఫార్ములా –ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. ఆయనను ఏ1గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏసీబీ. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ని ఏ2గా ఎఫ్ఐఆర్ లో  పేర్కొంది ఏసీబీ. వీళ్లకు తర్వలోనే నోటీసులు అందించి విచారణ చేపట్టే అవకాశం ఉంది.  ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ పేర్కొంది. నాలుగు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.

ఇటీవలే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేటీఆర్ విచారణకు అనుమతిచ్చిన  నేపథ్యంలో ప్రభుత్వం విచారణ బాధ్యతను ఏసీబీకి అప్పగించింది. దీంతో ఇవాళ కేసులు నమోదయ్యాయి. ఈ వివాదంలో ఏ3గా అప్పటి హెచ్ఎండీఏ చిఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. దీంతో పాటు ఓ ప్రైవేటు కంపెనీపైనా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నాలుగు  నాన్ బెయిలబుల్ సెక్షన్లే కావడం గమనార్హం.  రేపో ఎల్లుండో ఈ కేసులో కీలకమైన వ్యక్తులను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కేటీఆర్ పై నమోదైన సెక్షన్ల వివరాలు:
* 409, 120(బీ)

ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద రెండు కేసులు:
* 13(1)ఏ
* 13(1)బీ

కేటీఆర్పై కేసులు ఎందుకు నమోదయ్యాయంటే..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ రాసింది. ఏసీబీకి కూడా మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసింది. ఫార్ములా ఈ రేస్‌‌‌‌‌‌‌‌ కోసం జరిగిన బ్యాంక్ లావాదేవీలపై ఏసీబీ ఆరా తీసింది. పెట్టుబడులను రాబట్టే వ్యూహం పేరుతో గత సర్కారు హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించి ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించింది. ఇందుకోసం భారీగా ఖర్చు చేసింది.

గత బీఆర్ఎస్​ ప్రభుత్వంలో ‘కీ’ రోల్లో ఉన్న ఉన్నతాధికారి అర్వింద్​కుమార్​ అడ్డదారిలో ఈ ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. కేబినెట్​అనుమతి లేకుండానే రేస్ నిర్వహణకు రూ.55 కోట్లు అడ్వాన్స్గా ముట్టజెప్పినట్లు బయటపడింది. అది కూడా ఎన్నికల కోడ్​అమలులో ఉన్న టైమ్లో!! కేవలం ఫోన్ల ద్వారానే ఇదంతా నడిపించారు.

అత్యంత రద్దీగా ఉండే ట్యాంక్​బండ్​ చుట్టూ ఐమాక్స్​ సమీపంలో 2023లో కార్ల రేసింగ్ (ఫార్ములా రేస్​ సీజన్​ ఈవెంట్​9)​ను నిర్వహించారు. దీని వల్ల హైదరాబాద్ జనం నానా తిప్పలు పడ్డారు. అప్పుడు రేసింగ్​ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు హెచ్ఎండీఏ రూ.20 కోట్లు, రేస్కు ప్రమోటర్గా ఉన్న నెక్స్ట్ జెన్​అనే ప్రైవేట్​ఏజెన్సీ దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేసింది. క్యాంపెయిన్తో పాటు స్టాల్స్, సీటింగ్, స్ట్రీట్​ లైట్లు.. ఇతర ఖర్చులన్నీ ఆ ఏజెన్సీ భరించింది. సీజన్​ 9 ఈవెంట్​నిర్వహణకు హెచ్ఎండీఏ, నెక్స్ట్ జెన్​, ఫార్ములా–ఈ  కంపెనీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. సీజన్​9 నిర్వహణ వల్ల హెచ్​ఎండీఏకు గానీ, నెక్ట్స్​ జెన్​ సంస్థకు గానీ ఎలాంటి లాభం రాకపోగా భారీగా నష్టమే మిగిలింది.