ఫార్ములా–ఈ కేసు: ఈడీ విచారణలో కేటీఆర్‌ సమాధానాలు దాటవేసిన ప్రశ్నలివే..‌‌‌‌‌!

ఫార్ములా–ఈ కేసు: ఈడీ విచారణలో కేటీఆర్‌ సమాధానాలు దాటవేసిన ప్రశ్నలివే..‌‌‌‌‌!

ఫార్ములా–ఈ ఆపరేషన్స్​ (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఈవో), ఏస్‌‌‌‌‌‌‌‌ నెక్స్ట్‌‌‌‌‌‌‌‌ జెన్‌‌‌‌‌‌‌‌, ఎంఏయూడీ మధ్య త్రైపాక్షిక ఒప్పందాలు, హిమాయాత్‌‌‌‌‌‌‌‌ నగర్​ ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఓవర్సీస్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లోని హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ బోర్డు అకౌంట్‌‌‌‌‌‌‌‌ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను కేటీఆర్ ముందు పెట్టి.. వరుసగా ప్రధాన ప్రశ్నలు, అనుంబంధ ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించినట్లు తెలిసింది. ప్రస్తుత ఎంఏయూడీ స్పెషల్ చీఫ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ దానకిశోర్, అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ  అర్వింద్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌కు డబ్బులు బదిలీకి సంబంధించి బీఎల్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగానూ పలు ప్రశ్నలు వేసినట్లు సమాచారం.

  • ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకమని తెలిసినా బ్రిటన్​లోని ఎఫ్‌‌‌‌‌‌‌‌ఈవో కంపెనీకి డబ్బులు చెల్లించాలని ఎందుకు ఆదేశించారు? 
  • ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా విదేశీ కంపెనీకి నగదు ఎలా చెల్లిస్తారు? 
  • ఈసీ గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ మీకు తెలియదనుకోవాలా? 
  • మీరు చెప్తేనే నగదు బదిలీ చేశామని అధికారులు చెప్తున్నారు.. దీనికి మీ సమాధానం ఏమిటి?
  • ఈ ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు ఈడీ కేటీఆర్ ను అడిగినట్లు తెలిసింది

నాడు మంత్రిగా తన  బాధ్యతను సక్రమంగా నిర్వర్తించానని, కానీ ప్రొసీడింగ్స్.. రూల్స్​ ప్రకారం ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదని ఈడీకి ఇచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో కేటీఆర్‌‌‌‌‌‌‌‌  చెప్పినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మొదట రూల్స్​ ప్రకారమే చెల్లింపులు చేశామని కేటీఆర్​చెప్తూ వచ్చినా ఐటీ శాఖ నుంచి ఎంఏయూడీకి వచ్చిన రూ. 8.01కోట్ల అడిషనల్​ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ నోటీస్‌‌‌‌‌‌‌‌లను చూపించడంతో నాటి అధికారులపై నెట్టినట్లు సమాచారం.

గతేడాది నిర్వహించ తలపెట్టిన ఫార్ములా–ఈ రేస్​ సీజన్ 10 స్పాన్సర్ షిప్‌‌‌‌‌‌‌‌ నుంచి ఏస్‌‌‌‌‌‌‌‌ నెక్స్ట్‌‌‌‌‌‌‌‌ జెన్ తప్పుకోవడానికి గల కారణాలపై ఈడీ ఆరా తీసినట్లు తెలిసింది. ‘‘మొదటి అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ గడువు ముగిసిన తర్వాత ఫార్ములా –ఈ ఆపరేషన్స్ కంపెనీ నుంచి మళ్లీ ప్రపోజల్స్ వచ్చాయా..? లేదంటే ఎంఏయూడీ వారిని సంప్రదించిందా?’’ అనే వివరాలతో ఈడీ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఎంఏయూడీ అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటే హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ  బోర్డు నిధులను ఎందుకు చెల్లించారనే కోణంలోనూ కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించినట్లు సమాచారం. సీజన్‌‌‌‌‌‌‌‌ 9 టైమ్​లో  ట్రాక్ ఏర్పాటు కోసం ఖర్చు చేసిన రూ.12 కోట్లకు సంబంధించిన వివరాలనూ ఆరా తీసినట్లు తెలిసింది. ప్రధానంగా ‘‘ఎఫ్‌‌‌‌‌‌‌‌ఈవోకు 2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3, 11వ తేదీల్లో హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ బోర్డు నిధుల నుంచి రూ.45.71 కోట్లు మంజూరు చేసేందుకు అనుమతులు ఎవరు ఇచ్చారు..? వీటికి సంబంధించిన నోట్‌‌‌‌‌‌‌‌ ఫైల్‌‌‌‌‌‌‌‌, జీవోలు ఎక్కడ?’’ అని కూడా కేటీఆర్​ను ఈడీ ఆఫీసర్లు ప్రశ్నించినట్లు సమాచారం.

ALSO READ | అధికారులు తప్పు చేసి జైలుపాలు కావొద్దు : మంత్రి సీతక్క

బ్రిటన్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఫార్ములా –ఈ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌(ఎఫ్‌‌‌‌‌‌‌‌ఈవో) సంస్థ హైదరాబాద్​లోనే ఈవెంట్స్​నిర్వహించాలనుకోవడానికి కారణమేమిటని ఈడీ ఆరా తీసింది.  ‘‘ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌ ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ ఎవరు తీసుకొచ్చారు? కంపెనీనే నేరుగా సంప్రదించిందా? లేదంటే ఇతర ప్రైవేట్ కంపెనీలు ఈ– రేస్​ను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాయా?’’ అని కేటీఆర్​ను ప్రశ్నించినట్లు తెలిసింది. 

స్పాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న ఏస్ నెక్స్ట్‌‌‌‌‌‌‌‌ జెన్‌‌‌‌‌‌‌‌ సంస్థ గురించి పదేపదే ఆరా తీసినట్లు సమాచారం. ‘‘ఏస్​ నెక్స్ట్‌‌‌‌‌‌‌‌  జెన్‌‌‌‌‌‌‌‌ మాతృ సంస్థ  గ్రీన్‌‌‌‌‌‌‌‌కో కంపెనీ ఎలక్టోరల్‌‌‌‌‌‌‌‌ బాండ్స్‌‌‌‌‌‌‌‌ ఎందుకు తీసుకుంది?  2022 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌, అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 10న గ్రీన్‌‌‌‌‌‌‌‌కో  అనుబంధ కంపెనీల నుంచి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​కు రూ.41 కోట్ల బాండ్స్‌‌‌‌‌‌‌‌ వచ్చిన 15 రోజుల వ్యవధిలో అంటే 2022 అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 25న ఏస్‌‌‌‌‌‌‌‌  నెక్స్ట్‌‌‌‌‌‌‌‌ జెన్‌‌‌‌‌‌‌‌, ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌, ఎంఏయూడీ మధ్య ఫార్ములా రేస్​ అగ్రిమెంట్స్‌‌‌‌‌‌‌‌ జరగడానికి  కారణాలేంటి?’’ అని ఈడీ బృందం అడిగినట్లు తెలిసింది.

 ఈ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం దాటవేసినట్లు సమాచారం. నాలుగు సీజన్స్ కోసం దాదాపు రూ.600 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎఫ్‌‌‌‌‌‌‌‌ఈవో, ఏస్‌‌‌‌‌‌‌‌ నెక్స్ట్‌‌‌‌‌‌‌‌ జెన్‌‌‌‌‌‌‌‌తో జరిగిన త్రైపాక్షిక ఒప్పందంలో ఎంఏయూడీ పేర్కొన్న విషయంపైనా ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్స్‌‌‌‌‌‌‌‌ను కేటీఆర్ ముందుంచి ఆరా తీశారు. అసలు కార్ రేసింగ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించడం వల్ల  ప్రభుత్వానికి  గానీ ఎంఏయూడీకి గానీ ఎలాంటి లాభాలు వచ్చాయి? అని  ప్రశ్నించగా.. ఏసీబీకి చెప్పినట్లే రూ.700 కోట్ల లాభాలు వచ్చాయని కేటీఆర్​ చెప్పినా, అవి ఎక్కడ ఉన్నాయంటే సమాధానం చెప్పలేకపోయినట్లు తెలిసింది.