
- వర్చువల్‌గా హాజరైన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అల్బర్టో
- ఎంఏయూడీ. ఏస్ నెక్ట్స్ జెన్ అగ్రిమెంట్స్‌పై వివరణ
- ఎఫ్‌ఈవో నుంచి హెచ్‌ఎండీఏకు వచ్చిన ఇన్వాయిస్‌ల పరిశీలన
- రూ.45.71 కోట్లు లండన్‌లోని ఎఫ్‌ఈవో అకౌంట్లకే చేరినట్లు ఆధారాలు
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ–రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లండన్‌కు చెంది న ఫార్ములా ఈ ఆపరేషన్ (ఎఫ్‌ఈవో) సంస్థ ప్రతినిధు లు సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఎఫ్ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అల్బర్టో ఏసీబీ ముందు వర్చువల్‌గా హాజరయ్యాడు. ఉదయం11 గంటల నుం చి దాదాపు గంటన్నర పాటు ప్రశ్నించిన ఏసీబీ.. పలు వివరాలను సేకరించింది. ఏసీబీ అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానంగా పలు డాక్యుమెంట్లు అందించినట్లు తెలిసింది. అగ్రిమెంట్స్ ప్రకారమే తాము సీజన్ 9 విజయవంతంగా నిర్వహించామని అల్బర్టో స్పష్టం చేసినట్లు సమాచారం.
వివిధ కారణాల వల్ల సీజన్ 10 రద్దు చేసుకున్నట్లు వివరించారు. ఇందు కు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్‌నూ అందిస్తామని చెప్పినట్టు తెలిసింది. కేసు దర్యాప్తులో భాగంగా డిసెం బర్ 25న ఎఫ్‌ఈవో సీఈఓకు ఏసీబీ అధికారులు నోటీ సులు జారీ చేశారు. నాలుగు వారాల సమయం కోరిన సంస్థ.. సోమవారం ఏసీబీకి వివరణ ఇచ్చింది.
ప్రపోజల్స్ తెచ్చింది.. గ్రీన్కో నా? రాష్ట్ర ప్రభుత్వమా?
2022 అక్టోబర్25న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్(ఎంఏయూడీ), ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్ట్స్ జెన్ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం, ఆ తరువాత 2023లో ఎంఏయూడీ, ఎఫ్‌ఈవో మధ్య జరిగిన అగ్రిమెంట్స్‌కు సంబంధించి అల్బర్టో పంపించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులను పరిశీలించారు. ఎఫ్‌ఈవో వద్ద ఉన్న అగ్రిమెంట్‌ను ఇప్పటికే పీడీఎఫ్ ద్వారా అందించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఈ కారు రేసింగ్ నిర్వహణకు ఎవరు ప్రపోజల్స్ తీసుకొచ్చారు.. గ్రీన్ కో సంస్థనా? లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందా? అనే వివరాలను సేకరించినట్టు సమాచారం. ఎఫ్‌ఈవోకు ఇండియాలో ఎక్కడైనా బ్రాంచీలు ఉన్నాయా? అని ప్రశ్నించగా, లండన్ కేంద్రంగానే ఫార్ములా ఈ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించినట్లు సమాచారం.
రేసింగ్‌కు ఎవరెవరు సహకరించారు
ఎలక్ట్రిక్ కార్ రేసింగ్‌కు రాష్ట్రం నుంచి ఎవరు సహకరించారనే వివరాలను ఆడియో, వీడియో ద్వారా స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. సీజన్ 9,10,11,12 ఈవెంట్స్ నిర్వహించేందుకు చేసుకున్న అగ్రిమెంట్స్‌ను ఆ సంస్థ ప్రతినిధులు మార్క్ చేయించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే హెచ్‌ఎండీఏ బోర్డ్ అకౌంట్ నుంచి లండన్‌లోని ఎఫ్‌ఈవో చేరిన రూ.45.71 కోట్లకు సంబందించిన వివరాలను అధికారులు సేకరించారు. వీటికి సంబంధించి ఎఫ్‌ఈవో నుంచి హెచ్‌ఎండీకు వచ్చిన ఇన్వాయిస్‌లు, ఆ తరువాత జరిగిన ఫారిన్ ఎక్స్చేంజ్ గురించి ఆరా తీసినట్లు తెలిసింది. ఏసీబీ ప్రశ్నలకు డాక్యుమెంట్లను పీడీఎఫ్ రూపంలో అందించినట్లు సమా చారం. మరోసారి ఎఫ్‌ఈవో సంస్థ ప్రతినిధుల నుంచి పలు వివరాలను సేకరించనున్నట్లు తెలిసింది.