ముగిసిన ఫస్ట్ డే విచారణ.. ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కేటీఆర్

ఫార్ములా ఈ రేసు కేసులో తొలి రోజు కేటీఆర్ విచారణ ముగిసింది. ఏడు గంటల విచారణ తర్వాత.. 2025, జనవరి 9వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో.. ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు కేటీఆర్. విచారణ తర్వాత బయటకు వచ్చిన కేటీఆర్.. విచారణపై కామెంట్స్ చేశారు.

ఉన్న నాలుగు, ఐదు ప్రశ్నలనే తిప్పి తిప్పి 40 సార్లు అడిగారంటూ సెటైర్లు వేశారు. మళ్లీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు అని.. ఎప్పుడు పిలిచినా మళ్లీ వస్తానంటూ మీడియా ఎదుట స్పష్టం చేశారు కేటీఆర్.

ఏడు గంటలు విచారణ

జనవరి 9న ఉదయం10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేటీఆర్ ను ఏసీబీ విచారించింది.  కేటీఆర్ వెంట సీనియర్  లాయర్  రామచంద్రారావు ఉన్నారు.  లైబ్రరీ రూం నుంచి విచారణను పరిశీలించారు.  మధ్యాహ్నం 1.30 గంటలకు అరంగట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. దాదాపు 7 గంటలు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారించారు.  విచారణలో కేటీఆర్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు అధికారులు. 

ALSO READ | కొనసాగుతోన్న విచారణ .. ఏసీబీ ప్రశ్నలతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి .!

కేటీఆర్ ను ఏసీబీ అధికారులు జేడీ రితిరాజ్, ఏఎస్సీ శివరాం శర్మ, డీఎస్పీ మాజీద్ ఖాన్  కేటీఆర్ పై  వరుసగా ప్రశ్నలు వేశారు. దాదాపు 35  ప్రశ్నలు సంధించారని తెలిసింది. అనుమతుల్లేకుండా హెచ్ఎండీఏ నిధుల మళ్లింపు, ఈ రేస్ నిర్వహణకు కారణాలపై ఏసీబీ అధికారులు ఫోకస్ చేస్తున్నారు.