హైదరాబాద్: ఫార్ములా ఈ రేసు కేసులో HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్ తోపాటు , బీఎల్ ఎన్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ లకు ఈడీ నోటీసులు పంపించింది.
ఫార్ములా ఈ రేసు కేసులో ఇప్పటికే పిటిషనర్ దాన కిషోర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈడీ సేకరించింది. ఫార్ములా ఈ రేసు నిర్వహణ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం ఫెమా నిబంధనల ఉల్లంఘటన వంటి అంశాలపై బీఎల్ ఎన్ రెడ్డిని ఈడీ విచారించనుంది.
Also Read :- ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ టీమ్‌కు స్వయం ప్రతిపత్తి
జనవరి16న విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు నోటీసులిచ్చిన ఈడీ.. మొదటి మొదటి జనవరి 2న విచారణకు హాజరు కావాలని బీఎల్ ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ లకు నోటీలిచ్చింది..అయితే విచారణను జనవరి 8కి వాయిదా వేస్తూ మరో నోటీస్ జారీ చేసింది.