హైకోర్టులో కేటీఆర్ కు షాక్ : ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు గ్రీన్ సిగ్నల్

హైకోర్టులో కేటీఆర్ కు షాక్ : ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు గ్రీన్ సిగ్నల్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏసీబీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. విచారణ కొనసాగించాలంటూ ఆదేశాలు ఇచ్చింది.

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ‘నాట్ టూ అరెస్ట్’ ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాది కోరినప్పటికీ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. ఇలాంటి పిటిషన్లలో కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏసీబీ వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.

ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్‌‌ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌‌పై హైకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. దీనిపై జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ తీర్పు చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్‌‌ను అరెస్టు చేయరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే.. ఇప్పుడు ఈ మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తేసి విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో.. ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Also Read : కేటీఆర్ అరెస్ట్ పైనా.. స్టే ఎత్తివేసిన హైకోర్టు

అయితే.. హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకెళ్లాలనే విషయంలో కేటీఆర్ తన లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు. ఏసీబీ దర్యాప్తునకు సహకరించాలని కేటీఆర్‌‌ను హైకోర్టు ఆదేశించడంతో ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ ముమ్మరంగా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఈ పిటిషన్పై పోయిన డిసెంబర్ 31న ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా.. తీర్పును హైకోర్టు ఇవాళ వెల్లడించింది.

హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై జరిగింది ఇది..
* తెలంగాణ హైకోర్టు లో కేటీఆర్ కి చుక్కెదురు
* కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
* ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం
* మధ్యంతర ఉత్తర్వులు కూడా ఎత్తివేసిన న్యాయస్థానం
* ఏసీబీ దర్యాప్తు లో మేము జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు
* చట్ట ప్రకారం నడుచుకోవాలన్న హైకోర్టు
*అందరికి రూల్ అఫ్ లా వర్తిస్తుందన్న న్యాయస్థానం