చెన్నై : ఇండియాలో తొలిసారి ఫార్ములా కార్లతో నైట్ రేసింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ లో భాగంగా చెన్నై నగరంలో ఈ నైట్ రేసింగ్ జరగనుంది. 3.5 కి.మీ స్ట్రీట్ సర్క్యూట్‌లో శని, ఆదివారాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్, ఫార్ములా–4 కార్లు గంటకు
200 కి.మీ పైచిలుకు స్పీడుతో దూసుకెళ్లనున్నాయి. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ తో పాటు ఆరు జట్లు ఈ పోటీలో బరిలో నిలిచాయి. స్ట్రీట్ సర్క్యూట్‌లో దాదాపు 9 వేల మంది ప్రేక్షకులు ఈ రేసును చూసేందుకు ఏర్పాట్లు చేశారు.