హైదరాబాద్, వెలుగు: రెట్ హెల్త్‌కేర్ హైదరాబాద్‌కు సమీపంలోని కర్కపట్ల బయోటెక్ పార్క్ ఫేజ్–3 లో ఫార్ములేషన్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌ను రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. ట్యాబ్లెట్లు, పౌడర్లు, జెల్, లోషన్, హెయిర్ ఆయిల్, షాంపూలు వంటి ప్రొడక్ట్‌లను ఇందులో తయారు చేస్తారు. మొత్తం రూ. 15.96 కోట్లను ఈ ప్లాంట్ కోసం ఇన్వెస్ట్ చేశామని రెట్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. డైరెక్ట్‌గా 85 మందికి ఉద్యోగాలు ఇస్తామని వివరించింది. ఇందులో పర్మినెంట్ ఉద్యోగాలతో పాటు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని ఫార్మా హబ్‌లో ఫార్ములేషన్స్ పూర్తి చేస్తున్న ప్రొఫెషనల్ కంపెనీ రెట్ అని కంపెనీ సీఈఓ రఘువీర్ అన్నారు.
ఇవి కూడా చదవండి
జీతాల్లేక కాంట్రాక్టు ఉద్యోగులు తిప్పలు
అసైన్డ్ భూములను గుంజుకున్నరు..ఉనికిచెర్లలో 118 ఎకరాలు తీసుకున్న ‘కుడా’