
- ఈసీకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ హిందూయేతర పార్టీలకు ఓటు వేయవద్దని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి అన్నారు. బీజేపీ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్, హిందూయేతర పార్టీలకు ఓటు వేయవద్దని బీజేపీ చెప్పడం ఈసీ రూల్స్ కి విరుద్ధమని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఓటింగ్‌కు దూరంగా ఉండకపోతే చర్యలు తప్పవని బీఆర్ఎస్ తన కార్పొరేటర్లను హెచ్చరించిందన్నారు. విప్ కూడా జారీ చేసిందని స్పష్టం చేశారు. పార్టీ తమ కార్పొరేటర్లకు ఇలా ఆదేశాలు ఇవ్వడం, ప్రజాప్రాతినిధ్య చట్టం 123కి విరుద్ధమన్నారు. అలాగే.. ఓటువేయడం ప్రతిపౌరుడి హక్కని గుర్తుచేశారు.