గన్నేరువరం, వెలుగు : కరీంనగర్ జిల్లా గన్నేరువరంలోని వైన్ షాపు వద్ద కుర్చీ కోసం రెండు వర్గాలు కొట్టుకున్నాయి. ఓ వ్యక్తి గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నేరువరం శివారులోని రాజరాజేశ్వర వైన్స్ పక్కనే ఓపెన్ సిట్టింగ్ఉంది. బుధవారం సాయంత్రం మైలారం గ్రామానికి చెందిన కొంతమంది అక్కడ లిక్కర్ తాగుతున్నారు.
ALSO READ: పాత ప్రాజెక్టులను .. పక్కన పెట్టిండ్రు
వారిలోని ఓ వ్యక్తి బయటకు వెళ్లగా అంతలోనే మరికొంతమంది వచ్చి ఖాళీగా ఉన్న ఆ కుర్చీని తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి కుర్చీలు, బీరు సీసాలు విసురుకుంటూ ఘర్షణ పడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించారు.