
మాదాపూర్, వెలుగు: కొండాపూర్లోని 8వ బెటాలియన్లో అధికారులు, సిబ్బంది ఉండేందుకు క్వార్టర్ల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. టీఎస్ఎస్పీ ఏడీజీపీ స్వాతి లక్రా ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ స్టేట్ పోలీస్హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్సహకారంతో రూ.13 కోట్ల వ్యయంతో నిర్మించబోయే 19 క్వార్టర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ రమేశ్, టీఎస్ఎస్పీ డీఐజీ సిద్దికి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు సుబ్రమణ్యం, తులసిధర్, ఈశ్వర్, బెటాలియన్ కమాండెంట్ సన్నీ, బెటాలియన్ అధికారులు పాల్గొన్నారు.