కొత్త ఉస్మానియా దవాఖానలో హెలీప్యాడ్​

కొత్త ఉస్మానియా దవాఖానలో హెలీప్యాడ్​
  • వందేండ్ల అవసరాలకు తగ్గట్టు హాస్పిటల్ నిర్మాణం: సీఎం
  • భ‌‌‌‌వ‌‌‌‌న నిర్మాణ నిబంధ‌‌‌‌న‌‌‌‌లు పూర్తిగా పాటించాలి
  • పార్కింగ్‌‌‌‌, ఫైర్‌‌‌‌స్టేష‌‌‌‌న్‌‌‌‌, ఎస్టీపీ, హెలీ అంబులెన్స్ సౌక‌‌‌‌ర్యాలు ఉండాలి
  • సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
  • ఈ నెల 31న ఆసుప‌‌‌‌త్రి నిర్మాణానికి శంకుస్థాప‌‌‌‌న‌‌‌‌

హైద‌‌‌‌రాబాద్‌‌‌‌, వెలుగు:   వందేండ్ల అవ‌‌‌‌స‌‌‌‌రాల‌‌‌‌కు త‌‌‌‌గ్గట్టు పూర్తి ఆధునిక‌‌‌‌ వ‌‌‌‌స‌‌‌‌తుల‌‌‌‌తో ఉస్మానియా ఆసుప‌‌‌‌త్రి నిర్మాణం ఉండాల‌‌‌‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆసుప‌‌‌‌త్రి నిర్మాణానికి సంబంధించి ఏ విష‌‌‌‌యంలోనూ రాజీప‌‌‌‌డొద్దని అధికారులకు సూచించారు. గోషామహల్​లో ఉస్మానియా దవాఖాన నిర్మాణానికి ఈ నెల 31న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌‌‌‌న చేయ‌‌‌‌నున్నారు. ఈ నేప‌‌‌‌థ్యంలో ఆసుప‌‌‌‌త్రి నిర్మాణంపై శనివారం త‌‌‌‌న నివాసంలో అధికారులతో సీఎం సమీక్షించారు. ఉస్మానియా ఆసుప‌‌‌‌త్రి భ‌‌‌‌వ‌‌‌‌న నిర్మాణాల‌‌‌‌తో పాటు బోధ‌‌‌‌న సిబ్బంది, విద్యార్థి, విద్యార్థినుల‌‌‌‌కు వేర్వురుగా నిర్మించే హాస్టల్ భ‌‌‌‌వ‌‌‌‌నాల విష‌‌‌‌యంలోనూ పూర్తి నిబంధన‌‌‌‌లు పాటించాల‌‌‌‌ని ఆయన సూచించారు.  ఆసుప‌‌‌‌త్రి భ‌‌‌‌వ‌‌‌‌న నిర్మాణాలు, పార్కింగ్‌‌‌‌, ల్యాండ్ స్కేప్ విష‌‌‌‌యంలో త‌‌‌‌గు జాగ్రత్తలు పాటించాల‌‌‌‌న్నారు. అవ‌‌‌‌య‌‌‌‌వాల మార్పిడి, అత్యవ‌‌‌‌స‌‌‌‌ర స‌‌‌‌మయాల్లో రోగుల త‌‌‌‌ర‌‌‌‌లింపు కోసం వీలుగా హెలీ అంబులెన్స్‌‌‌‌లు వినియోగిస్తున్నందున హెలీప్యాడ్ నిర్మాణం చేప‌‌‌‌ట్టాలని ఆయన ఆదేశించారు. ఆసుప‌‌‌‌త్రికి రాక‌‌‌‌పోక‌‌‌‌లు సాగించేలా న‌‌‌‌లువైపులా ర‌‌‌‌హదారులు ఉండాల‌‌‌‌ని.. అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మైన‌‌‌‌చోట ఇత‌‌‌‌ర మార్గాల‌‌‌‌ను క‌‌‌‌లిపేలా అండ‌‌‌‌ర్‌‌‌‌పాస్‌‌‌‌లు నిర్మించాల‌‌‌‌న్నారు. 

ఆహ్లాదకర వాతావరణం ఉండాలి

కొత్త ఉస్మానియా ఆసుప‌‌‌‌త్రికి వ‌‌‌‌చ్చే రోగులు, స‌‌‌‌హాయ‌‌‌‌కులు, ప‌‌‌‌రామ‌‌‌‌ర్శకు వ‌‌‌‌చ్చే వాళ్ల వాహ‌‌‌‌నాలు నిలిపేందుకు వీలుగా అండ‌‌‌‌ర్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో రెండు ఫ్లోర్లలో పార్కింగ్ ఉండాలని అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. డార్మిట‌‌‌‌రీ, ఫైర్ స్టేష‌‌‌‌న్, క్యాంటిన్‌‌‌‌, మూత్రశాల‌‌‌‌లు, ఎస్టీపీలు నిర్మించాల‌‌‌‌న్నారు. పిల్లలు విదేశాల్లో స్థిర‌‌‌‌ప‌‌‌‌డుతుండ‌‌‌‌డంతో  వారు వ‌‌‌‌చ్చేందుకు రెండు మూడు రోజులు ప‌‌‌‌డుతోంద‌‌‌‌ని.. అప్పటి వ‌‌‌‌ర‌‌‌‌కు మృత‌‌‌‌దేహాల‌‌‌‌ను భ‌‌‌‌ద్రప‌‌‌‌ర్చేందుకు ఆధునిక సౌక‌‌‌‌ర్యాల‌‌‌‌తో మార్చురీ, బాడీ ఫ్రీజింగ్ నిర్మాణాలు ఉండాల‌‌‌‌ని ఆయన  సూచించారు. ఆసుప‌‌‌‌త్రిలో అడుగుపెట్టగానే ఆహ్లాద‌‌‌‌క‌‌‌‌ర వాతావ‌‌‌‌ర‌‌‌‌ణం ఉండాల‌‌‌‌ని, ఆసుప‌‌‌‌త్రికి వ‌‌‌‌చ్చామ‌‌‌‌నే భావ‌‌‌‌న ఉండ‌‌‌‌కూడ‌‌‌‌ద‌‌‌‌న్నారు. ఆసుప‌‌‌‌త్రి భ‌‌‌‌వ‌‌‌‌న నిర్మాణాల‌‌‌‌కు సంబంధిం చిన న‌‌‌‌మూనాల్లో ప‌‌‌‌లు మార్పులు చేర్పుల‌‌‌‌ ను సీఎం సూచించారు. స‌‌‌‌మీక్షలో ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌‌‌‌ర రాజ‌‌‌‌న‌‌‌‌ర్సింహ‌‌‌‌, సీఎం స‌‌‌‌ల‌‌‌‌హాదారు వేం న‌‌‌‌రేంద‌‌‌‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ స‌‌‌‌ల‌‌‌‌హాదారు (మౌలిక వ‌‌‌‌స‌‌‌‌తులు) శ్రీ‌‌‌‌నివాస‌‌‌‌రాజు, సీఎం జాయింట్​సెక్రటరీ  సంగీత స‌‌‌‌త్యనారా య‌‌‌‌ణ‌‌‌‌, వైద్యారోగ్య శాఖ కార్యద‌‌‌‌ర్శి క్రిస్టినా జ‌‌‌‌డ్ చోంగ్తూ, ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్స్ క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ శశాంక, హైద‌‌‌‌రాబాద్ క‌‌‌‌లెక్టర్ అనుదీప్ దురిశెట్టి  పాల్గొన్నారు.