108 అడుగుల దాసాంజనేయ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన

108 అడుగుల దాసాంజనేయ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన

జ్యోతినగర్, వెలుగు: రామగుండం బీ పవర్ హౌజ్ గడ్డ పై ఏర్పాటు చేయనున్న 108 అడుగుల దాసాంజనేయ  స్వామి విగ్రహం నిర్మాణానికి  రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.8కోట్లతో విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు.

 ఇటీవల 1800 ఏండ్ల కింది పురాతన కోదాండ వీరాంజనేయం విగ్రహం బయటపడింది. ఈ ప్రాంత గుట్టపై రాముని గుండాలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మనాలీ ఠాకుర్, పార్టీ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.