నర్సంపేట, వెలుగు : నర్సంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లె, పర్శనాయక్‌తండా, నారాయణ తండా వరకు రూ.2.50 కోట్ల నిర్మించే తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
మాధన్నపేటలో ఇందిరా మహిళా శక్తి స్కీం కింద మంజూరైన సంచార చేపల వాహానాన్ని ప్రారంభించారు. పర్శనాయక్‌తండాలో ఆర్వో వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.