- మంత్రి దామోదర రాజనర్సింహ
కూకట్పల్లి, వెలుగు : వైద్యం రంగంలో లయన్స్క్లబ్చేస్తున్న సేవలు అమూల్యమైనవని మంత్రి దామోదర్‌రాజనర్సింహ అన్నారు. బాలానగర్కిషన్రావు లయన్స్‌కంటి ఆసుపత్రి ప్రాంగణంలో రూ.2.50 కోట్లతో చేపడుతున్న అదనపు భవన నిర్మాణానికి మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు.
అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా బాలానగర్ లయన్స్ కంటి ఆసుపత్రి నిర్వాహకులు చేస్తున్న సేవలు ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ వై.నవీన్‌రావు, కూకట్పల్లి కాంగ్రెస్ఇన్చార్జి బండి రమేశ్పాల్గొన్నారు.