ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ లో శుక్రవారం టీయూ ఎఫ్ఐడీసీ నిధులు 135 లక్షల వ్యయంతో తలపెట్టిన స్ట్రోమ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో మేయర్ పూనకొల్లు నీరజ, స్థానిక కార్పొరేటర్ మందడపు లక్ష్మీ-మనోహర్, మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, పాలేపు వెంకటరమణ, ఎండీ ఖాదర్ బాబా, తుపాకుల శ్రీను, ప్రతిభా రెడ్డి, బాణాల లక్ష్మణ్, పాలకుర్తి నాగేశ్వరావు, కూరపాటి ఉదయ్, చిలుకూరి ఉపేందర్, నాయకులు పాల్గొన్నారు.