రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన 

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్​జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 5వ వార్డులో ఎమ్మెల్యే నాగరాజు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బుధవారం రూ.3 కోట్ల అంచనాతో నిర్మించనున్న దుబ్బతండా దుర్గమ్మ గుడి దగ్గర నుంచి గబ్బెట తండా, దుబ్బతండా మీదుగా బీటీ రోడ్డుకోసం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్​ చైర్​పర్సన్, అధికారులతో మాట్లాడి స్థానిక సమస్యలపై ఆరా తీశారు.

అనంతరం తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ర్యాలీని ప్రారంభించారు, అంగన్​వాడీ పిల్లలకు దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంగోతు అరుణ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, వెంకటేశ్వర తండాకు వెళ్లే రహదారి సరిగాలేదని తండా వాసులు జాతీయ రహదారిపై ఆందోళన చేసి, ఎమ్మెల్యే కారు ఆడ్డుకునే ప్రయత్నం చేశారు.