టాటా మోటార్స్ ​ప్లాంటుకు శంకుస్థాపన

టాటా మోటార్స్ ​ప్లాంటుకు శంకుస్థాపన
  • రూ.9 వేల కోట్లు పెట్టుబడి

చెన్నై: స్పోర్ట్స్ కార్లు, ఎస్​యూవీలను తయారు చేసే టాటా మోటార్స్ కొత్త ప్లాంట్‌‌‌‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం శంకుస్థాపన చేశారు. రూ. 9,000 కోట్ల పెట్టుబడితో కడుతున్న ఈ ప్లాంట్‌‌‌‌లో టాటా మోటార్స్ కార్లతో పాటు   బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్​ఆర్​) కార్లనూ  తయారు చేస్తారు. ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి దశలవారీగా ప్రారంభమవుతుంది. 

రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాలలో సంవత్సరానికి 2.50 లక్షల యూనిట్ల సామర్థ్యాన్ని చేరుకుంటుంది.  చెన్నైకి 115 కిలోమీటర్ల దూరంలోని పనపాక్కంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సదుపాయం 5,000 కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం  ఉందని టాటా మోటార్స్​ తెలిపింది.