నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాల శంకుస్థాపన ఏర్పాట్లపై ఎస్పీ శరత్ చంద్ర పవార్, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
నల్గొండ సమీపంలోని గంధంవారిగూడెంలో ఉదయం 10 గంటలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామం వద్ద మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ
మైనార్టీ రెసిడెన్షియల్పాఠశాలలకు చెందిన తల్లిదండ్రులు, టీచర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యేలా చూడాలని అధికారులకు చెప్పారు. కాన్ఫరెన్స్లో అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్, టి.పూర్ణచంద్ర, ఆర్ అండ్ బీ ఎస్ఈ సత్యనారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.